ప్రధాన కంటెంట్‌కు వెళ్ళండి
రత్నాలబాలరత్నాలబాల–జ్ఞానమాల

తెలుగు ఫాంట్

అక్షర సైజ్

100%

ఫాంట్ల జాబితా లోడ్ అవుతోంది…

తెలుగు భాషాభిమానులందరికీ హృదయపూర్వక నమస్కారాలు!

డిజిటల్ యుగంలో మన తెలుగు భాష అడుగుపెట్టడం, ముద్రణలోనూ ఆన్‌లైన్‌లోనూ తెలుగు యూనికోడ్ ఫాంట్లు ఇంత సులభంగా అందుబాటులోకి రావడం మనందరికీ ఎంతో సంతోషకరమైన విషయం. తెలుగు ఫాంట్లను ప్రతి ఒక్కరికీ ఉచితంగా అందించాలనే గొప్ప లక్ష్యంతో సిలికానాంధ్ర, FreeTeluguFonts.com, telugufonts.in బృందాలు చేస్తున్న కృషి ఎంతో అభినందనీయం.

మన తెలుగు లిపికి ఆధునిక యూనికోడ్ ఓపెన్‌టైప్ (OpenType) సాంకేతికతను జోడించి, ఎంతో ఓపికతో, శ్రమతో అందమైన ఫాంట్లను రూపొందించి ఉచితంగా అందిస్తున్న శ్రీ అప్పాజీ అంబరీష దర్భ గారికి, శ్రీ పురుషోత్ కుమార్ గుత్తుల గారికి, అలాగే ఇతర ఫాంట్ రూపకర్తలందరికీ ‘రత్నాలబాల–జ్ఞానమాల’ తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. తెలుగు భాషను డిజిటల్ రూపంలో ముందుకు తీసుకెళ్తున్న మీ సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి!

మిరా ప్రస్థానం

వ్యక్తిగత వివరాలు
  • పేరు:

    డాక్టర్ మిరియాల రామకృష్ణ

  • పుట్టిన తేదీ:

    ఏప్రిల్ 7, 1934

  • జన్మస్థానం:

    తోలేరు, నరసాపురం దగ్గర, ప.గో. జిల్లా

  • స్వంత ఊరు:

    విరవాడ, పిఠాపురం దగ్గర, తూ.గో.జిల్లా

  • తల్లితండ్రులు:

    మిరియాల వెంకటరత్నం, శ్రీమతి భ్రమరాంబ

  • హైస్కూల్:

    రాజారావ్ భావయమ్మారావ్ బహద్దూర్ హైస్కూల్, పిఠాపురం

  • భాషాప్రవీణ-1956:

    మహరాజా సంస్కృత పాఠశాల, విజయనగరం.

  • వివాహం :

    లక్ష్మీదేవి

  • పిల్లలు:

    రమణీయ సుధారాణి , కమనీయ సుధాఫణి , శ్రీధర్

రచయిత , పరిశోధకుడు

మిరియాల రామకృష్ణ తెలుగు రచయిత, పరిశోధకుడు. ఇతను సుమారు 36 సంవత్సరాలు విద్యాశాఖలో తెలుగు భాషా సాహిత్యాలు బోధిస్తూ, మహాకవి శ్రీశ్రీ రచనలపై పరిశోధన చేశారు.

ఇతను రచించిన కథల్లో ఆకుపచ్చని కుక్కపిల్ల, ఆశ్చర్య చూడామణి, చెరసాలలో సరస్వతి, ఉంగరం వంటి గొప్ప కథలు ఉన్నాయి.

కథలతో పాటు పద్యాలు, వచన కవితలు, గేయాలు, వ్యాసాలు, బాలసాహిత్యం విస్తృతంగా వ్రాసారు.

సుధాకిరణ్, ఆనందవర్ధన్ వంటి పత్రికలతో కలసి రచనలు ప్రచురణలో ఉన్నాయి.

1995-96లో గీతాంజలి పత్రికకి సంపాదకుడుగా పని చేశారు.

హిమబిందు అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లిటరేచర్ సంస్థను స్థాపించి, మంచి రచనల కోసం అవార్డులు ఇచ్చుతూ రచయితలను ప్రోత్సహిస్తున్నారు.

చిత్రాలు
శ్రీశ్రీతో మిరియాల రామకృష్ణశ్రీశ్రీగారితో మిరా
 మిరియాల రామకృష్ణమిరియాల రామకృష్ణ
 మిరియాల రామకృష్ణమిరియాల రామకృష్ణ
సాహిత్య , పరిశోధనలు

.  రామకృష్ణకు ఈ రచనకు డాక్టరేట్ వచ్చినప్పుడు శ్రీశ్రీ "డియర్ డాక్టర్ రామకృష్ణా! హార్టీ కంగ్రాచ్యులేషన్స్.    యువర్స్ పేషెంట్లీ శ్రీశ్రీ" అంటూ సందేశం పంపి చమత్కరించారు.

తెలుగు భాష గురించి
సంస్కృతంబులోని చక్కెర పాకంబు  
అరవ భాషలోని అమృత రాశి  
కన్నడంబులోని కస్తూరి వాసన  
కలిసిపోయె తేట తెలుగునందు ! 

ఉగ్గుపాలనుండి ఉయ్యాలలోననుండి  
అమ్మ పాట పాడినట్టి భాష  
తేనెవంటి మందు వీనులకును విందు  
దేశభాషలందు తెలుగులెస్స!  

వేనవేల కవుల వెలుగులో రూపొంది  
దేశదేశములను వాసిగాంచి  
వేయి యేండ్లనుండి విలసిల్లు నా “భాష”  
దేశ భాషలందు తెలుగు లెస్స!
రచనలు: 21
  • 1965 - బాలాభిరామం
  • 1970 - రంగురంగుల రత్నదీపాలు
  • 1972 - స్నేహదేహళి
  • 1978 - ముత్యాలగొడుగు
  • 1981 - విద్యుద్వీణలు-వెన్నెలతీగలు
  • 1989 - దేశంమేలుకొంది
  • 1997 - సువర్ణస్వప్నం
  • 1998 - వివేకపట్టణం - కవిత్వం
  • 1980 - శ్రీశ్రీ కవిత్వం - వస్తువు, సంవిధానం
  • 1980 - శ్రీశ్రీ కవితావైభవం
  • 1996 - భావయిత్రి- కారయిత్రి
  • 1996 - సోమసుందర్ కవితా పరిణామం
  • 2002 - సినారె కవితా బింబం - విమర్శ
  • 1976 - సాహిత్య పదకోశం (తెలుగు అకాడెమీ ప్రచురణ)
  • 1984 - తెలుగు వాచకం (2వ తరగతి)
  • 1984 - దీపస్థంబాలు (10వ తరగతి తెలుగు ఉపవాచకం)
  • 1986 - శ్రీశ్రీ గారితో నా అనుబంధం
  • 1993 - పర్యాటకుడి డైరీ (ఉదయం సప్లిమెంట్)
  • 2002 - ఆరుద్రాక్షరం (ఎపిగ్రామ్‌లు)
  • 1989 - శ్రీశ్రీ ప్రపంచం క్విజ్ (స్వాతి వీక్లీ)
  • 2002 - రచన-రసన ఫీచర్ (నానాగాథలు - ప్రజాశక్తి)
పురస్కారాలు: 6
  • 1965 - దక్షిణ భాషా పుస్తక సమితి అవార్డు
  • 1970 - జాతీయ అవార్డు
  • 1978 - బెస్ట్ థీసీస్ అవార్డు, ఆంధ్రాయూనివర్శిటీ
  • 1989 - ఉత్తమ టీచర్ అవార్డ ు
  • 1995 - శ్రీ ఎన్.టి. రామారావు జన్మదినోత్సవ జిల్లా కళానీరాజనం పురస్కారం
  • 2002 - సోమసుందర్ సాహిత్య ట్రస్ట్ అవార్డ్
జీవితం ముఖ్య సంఘటనలు
  • 1956: పి.ఆర్. హైస్కూల్లో 6 నెలలు తెలుగు పండిట్ తాత్కాలిక ఉద్యోగం.
  • 1957: రాజమండ్రిలో పండిట్ ట్రైనింగ్.
  • 1957-58: కూనవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు పండిట్ ఉద్యోగం. శ్రీ సోమసుందర్, శ్రీ రాంషాలతో అనుబంధం మొదలైంది.
  • 1958-61: తరంగిణి పత్రిక నిర్వహణ, సంవత్సారానికి ఒక విడుదల.
  • 1960: హైదరాబాద్ అఖిల భారత తెలుగు రచయితల సభలో కృష్ణశాస్త్రి, సి.నారాయణరెడ్డిగారి పరిచయం.
  • 1962: ఆంధ్ర విశ్వ కళాపరిషత్తు (ఆంధ్రాయూనివర్శిటీ) వైజాగ్లో 'ఏం.ఏ' చదువు. డా.యస్వీ జోగారావుగారి ప్రోత్సాహం.
  • 1964: అనంతపురంలో ఎం.ఏ తర్వాత తెలుగు పండిట్  ఉద్యోగం.
  • 1965 ఆగష్టం 17:న జోశ్యుల నరసింహారావు, సీతాదేవిల ప్రథమ కుమార్తె 'లక్ష్మీదేవి'తో వివాహం.
  • 1966: ‘బాలాభిరామం’ ప్రచురణ, శ్రీ తిలక్ తో పరిచయం.
  • 1966 జూన్ 27: కుమార్తె రమణీయ సుధారాణి జననం.
  • 1968 జూన్: తణుకు ట్రాన్స్ఫర్.
  • 1970: చిట్టూరి ఇంద్రయ్య కళాశాలలో ఉద్యోగం.
  • 1970 ఏప్రిల్ 23: కుమార్తె కమనీయ సుధాఫణి జననం.
  • 1970 మే 8: హైదరాబాద్ తెలుగు అకాడమీలో ఉద్యోగం.
  • 1973: డా.కె.వి.రావు, డా.పి.యన్.ఆర్. అప్పారావుతో ఆత్మీయత.
  • 1973: రాజోలులో ఉద్యోగం.
  • 1974 మార్చి: శ్రీశ్రీ కవిత్వం పై పరిశోధన ప్రారంభం.
  • 1974 అక్టోబర్: అఖిల భారత తెలుగు బాలల మహోత్సవాలలో పాల్గొనడం.
  • 1975 ఏప్రిల్: ప్రపంచ తెలుగు మహాసభలకు ఆహ్వాన సంఘసభ్యుడిగా చేరడం.
  • 1975: కాకినాడ పి.ఆర్. ప్రభుత్వ కళాశాలకు ట్రాన్స్ఫర్.
  • 1976 ఏప్రిల్ 4: ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీలో సభ్యుడిగా ఎన్నిక.
  • 1977 మార్చి 26: కుమారుడు శ్రీధర్ జననం.
  • 1977 డిసెంబర్ 20: థీసిస్ సబ్మిట్.
  • 1978 జూన్: మొదటి హార్ట్ టాక్.
  • 1984: కాకినాడ పోస్టల్ కాలనీలో స్వగృహ నిర్మాణం.
  • 1985 మే 30: ప్రముఖ రచయిత, అభిసారిక సంపాదకులు శ్రీ రాంషాగారి ద్వితీయ కుమారుడు అంబరీషతో ప్రథమ కుమార్తె డా॥ సుధారాణి వివాహం
  • 1985 డిసెంబర్: తణుకు  ట్రాన్స్ఫర్.
  • 1986 అక్టోబర్ 22: మనుమడు చి. రాంషా జననం.
  • 1989: రెండోసారి హార్ట్ అటాక్, కాకినాడ నుంచి రాజమంద్రి పి.జి. సెంటర్ ట్రాన్స్ఫర్.
  • 1992 ఏప్రిల్:  రిటైర్ అయ్యి కాకినాడ స్వగృహానికి మరలి వచ్చారు
  • 1994 ఫిబ్రవరి 27: ప్రముఖ రచయిత కందుకూరి రామభద్రరావుగారి మనుమడు,శ్రీ కందుకూరి పుండరీకాక్షుడుగారి తృతీయ కుమారుడు రాధామనోహర్ ద్వితీయ కుమార్తె చి॥ సుధాఫణి వివాహం.
  • 1995: మనుమరాలు నవ్యశృతి జననం.
  • 1995: శ్రీ గొడవర్తి సత్యమూర్తి పక్షపత్రిక ‘గీతాంజలి’ సంపాదకత్వ బాధ్యతలు.
  • 1999: మూడో హార్ట్ అటాక్, హైద్రాబాద్ చికిత్స.
  • 2002 మే: హైదరాబాదు మోతీనగర్ కి నివాసం మార్చడం.
  • 2004 జనవరి 29: మధ్యాహ్నం 1:15 స్వర్గస్థులయ్యారు.